అసద్ ను అత్యంత సురక్షితంగా తీసుకొచ్చాము:- రష్యా 11 d ago
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ -అల్-అసద్ కు రాజకీయ ఆశ్రయం కల్పించినట్లు రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే.. అసద్ ను అత్యంత సురక్షితంగా తమ దేశానికి తీసుకొచ్చామని రష్యా విదేశంగా డిప్యూటీ మినిస్టర్ సెర్గీ ర్యాబ్కోవ్ వెల్లడించారు. అసాధారణ పరిస్థితిలో రష్యా అవసరమైన సహాయం అందజేస్తుందని చెప్పడానికి ఇదో నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాము అనేది చెప్పలేమని పేర్కొన్నారు.